TSPSC Group 3 Result 2024-25 

తెలంగాణ గ్రూప్‌ 3 ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ (TGPSC) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఆన్సర్‌ కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యంతరాల గడువు కూడా ముగిసింది. త్వరలో ఫైనల్‌ ఆన్సర్‌ కీ, ఫలితాలు విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి ప్రారంభంలో  విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 1,365 Group 3 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో 2024 నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.

TSPSC Group 2 Result 2025 Date

 : టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 783 ఖాళీల భర్తీ కోసం ఈ గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రూప్‌ 2 ఆన్సర్‌ కీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ పై అభ్యంతరాలకు గడువు జనవరి 22తో ముగిసింది. మరోవైపు ఈ TGPSC Group 2 ఫలితాలను విడుదల చేయడానికి TGPSC కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. టీజీపీఎస్సీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం TGPSC గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది.

0 Comments:

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | coupon codes